వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ని తనిఖీ చేసిన సీపీ

వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ని తనిఖీ చేసిన సీపీ

KNR: కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ని తనిఖీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పరేడ్ ను, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.