చెరువులో పడి బాలుడి మృతి

చెరువులో పడి బాలుడి మృతి

కృష్ణా: వేడుక ఆనందాన్ని విషాదంగా మార్చిన ఘటన గన్నవరం (M)లో బుధవారం చోటుచేసుకుంది. బూతిమిల్లిపాడులో ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకకు వచ్చిన చిన్నారులు ఆట ఆడుతూ చెరువులో జారి పడటంతో ఒక బాలుడు దుర్మరణం పాలయ్యాడు. చిన్న అవుటపల్లికి చెందిన ఆశిష్‌ మరో బాలుడితో కలిసి ఆడుతుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు బయటకు తీసినా ఆశిష్‌ అప్పటికే మృతిచెందాడు.