పాడి రైతులకు అవగాహన సదస్సు
GDWL: పాడి పరిశ్రమతోనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని మిడ్జిల్ మండల వైద్యాధికారి శివరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో పాడి రైతులకు సమీకృత దాణా తయారీ, మినరల్ మిక్స్చర్ వాడకం, గడ్డి పెంపకం, పాల అభివృద్ధి, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు కాల్షియమ్ సప్లిమెంట్లను పంపిణీ చేశారు.