విమాన ప్రయాణికులకు భారీ ఊరట
విమాన ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, పారదర్శకంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.