మొయినాబాద్‌లో మొదలైన పోలింగ్
RR: మొయినాబాద్ మండల పరిధిలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మండల పరిధిలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉండగా.. కనకమామిడి,వెంకటాపూర్, నాగిరెడ్డిగూడ, రెడ్డిపల్లి మోత్కూపల్లి ఏకగ్రీవం అయ్యాయి. మిగతా GPలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకే సమయం ఉండటంతో ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.