మంగళగిరి ఎయిమ్స్‌లో విద్యార్థులకు అస్వస్థత..!

మంగళగిరి ఎయిమ్స్‌లో విద్యార్థులకు అస్వస్థత..!

గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా వ్యాధి కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతో AIIMS వసతిగృహంలో దాదాపు 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఎయిమ్స్ ప్రత్యేక వార్డుల్లో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే నీటి కాలుష్యమే కారణమా.. అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.