ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన స్థానిక ఎమ్మెల్యే

NRML: భైంసా ప్రభుత్వ ఆసుపత్రిని ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఎల్లవేలలా వైద్యులు రోగుల సేవ నిమిత్తం అందుబాటులో ఉండాలని సూచించారు.