సీతానగరంలో 1,535ఎరువుల బస్తాలు సీజ్

E.G: సీతానగరం మండలం రఘుదేవపురంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం రెండు ఎరువుల షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.17.40 లక్షల విలువైన 1,535 ఎరువుల బస్తాలను సీజ్ చేశారు. ఎస్పీ స్నేహిత, డీసీటీఓ నవీన్ కుమార్, సీఐ మధుబాబు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. స్టాక్, బిల్లులు, రిజిస్టర్లలో తేడాలను గుర్తించి రెండు షాపులపై కేసులు నమోదు చేశారు.