పైపులైను లీకై రహదారి పైకి చేరుతున్న తాగునీరు

కోనసీమ: అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో ఆర్. డబ్ల్యూ. ఎస్ పైప్ లైన్ లీకై త్రాగునీరు వృధా అవుతుంది. ఈ నీరు నల్లచెరువు- అమలాపురం రహదారిపైకి చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ కు రిపేరు చేసి తాగునీరు వృధా కాకుండా చర్యలు చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.