టీడీపీ నేత పై దాడి.. కేసు నమోదు
NLR: బుచ్చి మండలం రేబాల సమీపంలో టీడీపీ నాయకుడు భువనేశ్వరం. మురళిపై దాడి కలకలకం రేపింది. తన చేపల గుంతల వద్ద మద్యం తాగవద్దని చెప్పినందుకు కొందరు దాడి చేశారని చెప్పారు. అడ్డు వచ్చిన మరో వ్యక్తిపైనా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నాయకుడితో పాటు మరోవ్యక్తికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సంతోష్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.