భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత

భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత

AKP: పూడిమడక ఉప్పుటేరులో మంగళవారం సాయంత్రం పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థ రసాయన జలాలు విడిచిపెట్టడంతో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిటీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.