విశాఖ ఉక్కుకు ఎల్పీజీ గ్యాస్ కొరత నుంచి ఊరట

విశాఖ ఉక్కుకు ఎల్పీజీ గ్యాస్ కొరత నుంచి ఊరట

VSP: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల ప్రభావంతో విశాఖ ఉక్కుకు ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య ప్రస్తుతం తొలగింది. బ్లూమ్స్ కటింగ్‌కు రోజుకు సుమారు 12 టన్నుల గ్యాస్ అవసరముండగా నిల్వలు తగ్గిపోవడంతో ఉత్పత్తిపై ఆందోళన నెలకొంది. అయితే గ్యాస్ సరఫరాకు మళ్లీ అనుమతులు లభించడంతో పరిస్థితి సాధారణమైంది. ప్రభుత్వ జోక్యం, అధికారుల కృషితో సరఫరా పునరుద్ధరించబడింది.