కేసీఆర్‌పై కడియం ఘాటు వ్యాఖ్యలు
JNGM: స్టేషన్ ఘనాపూర్ పట్టణంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు జాతిపితగా చెప్పుకోవడం సరికాదని, ప్రజా సమస్యలపై స్పందించకుండా దూరంగా ఉండటం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు.