ఉమ్మడి నల్లగొండ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చండూరు సీఐ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజీవ్ రెడ్డి, సర్పంచ్ మురళి గౌడ్ తదితరులున్నారు.