గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

VZM: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుర్ల పోలీసు స్టేషన్ పరిధి తారకరామ ప్రాజెక్టు కాల్వ గట్టు మణిపూరపేట గ్రామంలో ఎస్సై నారాయణరావు, సిబ్బందితో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి ఒక 1 కేజీ గంజాయి, బుల్లెట్ వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామన్నారు.