జిల్లాకు 156 టన్నుల కర్నూలు ఉల్లిపాయలు

జిల్లాకు 156 టన్నుల కర్నూలు ఉల్లిపాయలు

ప్రకాశం: జిల్లాకు కర్నూలు నుంచి 156 టన్నుల ఉల్లిపాయలు వచ్చినట్లు జేసీ గోపాలకృష్ణ తెలిపారు. వీటిని ఒంగోలు నగర పరిధిలోని రైతు బజార్లలో వినియోగదారులకు కిలో రూ.11లకు విక్రయిస్తున్నామన్నారు. కాగా, ఉల్లి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం వారి నుంచి కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేసి వినియోగదారులకు రూపాయి తగ్గించి విక్రయిస్తోందని తెలిపారు.