అల్లు అరవింద్‌ నివాసానికి సీఎం చంద్రబాబు

అల్లు అరవింద్‌ నివాసానికి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఇంటికి వెళ్లారు. ఇటీవల జరిగిన అల్లు శిరీష్‌ వివాహ వేడుకకు బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా అరవింద్‌ నివాసానికి వెళ్లిన సీఎం, నూతన వధూవరులను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులతో చంద్రబాబు కాసేపు ముచ్చటించారు.