'ఎల్లాపురం గ్రామ సమస్యలు పరిష్కరించండి'
BDK: పినపాక మండలం ఎల్లాపురం గ్రామం జాతీయ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఇవాళ కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పెద్దవాగు కారణంగా వారి గ్రామం ముంపుకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1976, 1999, రెండు పర్యాయాలు వారి గ్రామం కాలిపోవడం జరిగిందని తెలిపారు. ఊరి సమస్యలు పరిష్కరించాలని కోరారు.