VIDEO: వేడుకలకు సిద్ధమవుతున్న NTR స్టేడియం

VIDEO: వేడుకలకు సిద్ధమవుతున్న NTR స్టేడియం

MHBD: గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేపటి కార్యక్రమానికి వేదికను అలంకరించి, జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ గౌరవ వందనం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు అవసరమైన సన్నాహాలను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు.