'మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి'

NLG: హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని NLG పీడీ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చందంపేటలోని నర్సరీని ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామంలో నర్సరీలో ఉన్న మొక్కలను ఏపుగా పెంచి, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని ఇందుకు ఆయా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు చొరవ చూపాలన్నారు.