చాట్రాయిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం
ELR: ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి అత్తులూరి శ్రీనివాసరావు కోరారు. మంగళవారం చాట్రాయి మండలం చిన్నంపేటలో జరిగిన 'రైతన్న మీకోసం' ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు చేస్తున్న సేవలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు.