కోటిలింగాలలో శివపార్వతుల కళ్యాణం.. మంత్రి హాజరు

కోటిలింగాలలో శివపార్వతుల కళ్యాణం.. మంత్రి హాజరు

JGL: వెల్గటూర్‌లోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై స్వామివారి ఆశీస్సులు కోరారు. పూజారులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.