జీతం కోసం రోడ్డెక్కిన NHM ఉద్యోగులు
MHBD: జిల్లాలో NHM కింద కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు నిన్న నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మౌనంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం వహిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రోడ్ల పాలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.