VIDEO: 'నాకు చదువుకోవాలని ఉంది సార్'

VIDEO: 'నాకు చదువుకోవాలని ఉంది సార్'

JGL: అమ్మ ఆరోగ్యం క్షీణించి, ఇంటి బాధ్యతలతో చదువుకు దూరమైన ఏడో తరగతి విద్యార్థిని గ్రీష్మ తన బాధను ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించుకుంది. టీసీ ఆలస్యంతో వేరే పాఠశాలలో ప్రవేశం దక్కలేదని, పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని వేడుకుంది. బాలిక ఆవేదనకు స్పందించిన కలెక్టర్, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని DEO రామును ఆదేశించారు. గ్రీష్మకు పరీక్షలు రాసేలా మార్గం చూపాలని ఆదేశించారు.