మూడో పెళ్లి వార్తలపై షోయెబ్ మాలిక్ క్లారిటీ

మూడో పెళ్లి వార్తలపై షోయెబ్ మాలిక్ క్లారిటీ

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ మాలిక్ తన మూడో పెళ్లిపై వస్తున్న వార్తలను ఖండించాడు. తన వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. తన భార్య సనా జావెద్‌పై జరుగుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్‌ పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ఇవన్నీ కేవలం అవాస్తవాలని స్పష్టం చేశాడు. కాగా, గతంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం జరిగిన విషయం తెలిసిందే.