పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం

పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణల సమక్షంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, దాతలు రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తం సేకరించారు. రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని డీసీపీ కరుణాకర్ తెలిపారు.