చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే
E.G: రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద IYM ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. వేసవిలో నగర ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, చలివేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.