8కి చేరిన మృతుల సంఖ్య
ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఇరు నేతలు తమ సంతాపాన్ని తెలిపారు. అనంతరం మోదీ మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.