కొండపల్లికి రూ.57.12 కోట్లు మంజూరు

NTR: కొండపల్లి ప్రజలకు తాగునీటి సమస్యలు తీర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ.57.12 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించినట్లు మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇబ్రాహింపట్నంలో ఇంటికింటికి నీటి కనెక్షన్ అందజేస్తామన్నారు. దీన్ని 45 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.