ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందించిన ఉపాధ్యాయులు

కృష్ణా: గుడివాడలోని ప్రజా వేదికలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకి ఉపాధ్యాయ సంఘాలు శనివారం వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో ఉన్న 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పోలీస్ శాఖకు మెమో 57 అమలు చేయాలని కోరారు.