పరకాల ఏజీపీగా లక్కం శంకర్

WGL: పరకాలకి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది లక్కం శంకర్‌ను పరకాల ఏజీపీగా నియమిస్తూ హనుమకొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి నియామక పత్రాన్ని బుధవారం శంకర్ కి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అందజేశారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు గౌరవం ఇస్తుందని అన్నారు.