సింహాచలంలో ఘనంగా నిత్య కల్యాణం

సింహాచలంలో ఘనంగా నిత్య కల్యాణం

VSP: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం వివాహం నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులకు వేదాశీర్వచనం, ప్రసాదంతో పాటు అంతరాలయ దర్శనం కల్పించారు.