నన్ను కోసినా పైసలు లేవు: రేవంత్ రెడ్డి

TG: ఉద్యోగ సంఘాల నేతలపై CM రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా? సమస్య ఉంటే చర్చించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నన్ను కోసినా నా దగ్గర పైసలు లేవు. ఏ పథకాన్ని ఆపి మీకు జీతాలు పెంచాలి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.