చదళ్లలో డ్వాక్రా మహిళల జనరల్ బాడీ మీటింగ్

CTR: పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో శనివారం డ్వాక్రా మహిళల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. టీడీపీ నాయకులు వెంకటరెడ్డి హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తుందన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని తెలిపారు.