చంద్రగ్రహణం.. ఆలయం మూసివేత
RR: చంద్రగ్రహణం సందర్భంగా చేవెళ్ల పరిధి మల్కాపూర్‌లోని శ్రీ భువనేశ్వరీ సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని ఇవాళ తాత్కాలికంగా మూసివేసినట్లు ఆలయ అర్చకులు వినీత్ తెలిపారు. ఉదయం 7 గంటల వరకు నిత్యసేవలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసినట్లు, రేపు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పించబడతాయని తెలిపారు.