శ్రీశైలాన్ని సందర్శించిన విదేశీయులు
NDL: జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలాన్ని రష్యాకు చెందిన ముగ్గురు మహిళా భక్తులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారు జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా శ్రీశైలం వచ్చామని, తర్వాత రామేశ్వరం వెళ్లనున్నట్లు తెలిపారు. విదేశీయులు మన సంప్రదాయాలను గౌరవించడం పట్ల స్థానికులు సంతోషిస్తున్నారు.