'ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొదిలి ఎస్ఐ వేమన సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యాశకు పోయి బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్, మొబైల్‌కు వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పరాదని సూచించారు. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని తెలివిగా వాడుతున్నారని.. వాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలన్నారు.