మర్రిపాలెం గ్రామంలో నూతన వారపు సంత ఏర్పాటు
ASR: కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో బుధవారం నూతనంగా వారపు సంతను ఏర్పాటు చేశారు. వారపు సంత ఏర్పాటు వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందని సర్పంచ్ వెంకటలక్ష్మి, ఏఎంసీ ఛైర్మన్ రాజేశ్వరి, పంచాయతీ అభివృద్ధి అధికారి రవీంద్ర తెలిపారు. గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాల ప్రజలకు వారపు సంతలే సూపర్ మార్కెట్లుగా ఉపయోగపడతాయన్నారు.