రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా భైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు కాగా, దీంతో వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు చిరివెళ్ల గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.