VIDEO: 'మ్యాన్ హోల్‌ను ఏర్పాటు చేయండి'

VIDEO: 'మ్యాన్ హోల్‌ను ఏర్పాటు చేయండి'

KDP: పులివెందుల పట్టణంలోని గోపి విహార్ వీధిలో నెలకొన్న ప్రమాదకరమైన మ్యాన్ హోల్ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని నెలలుగా పాడైన మ్యాన్ హోల్ కారణంగా ఏర్పడిన పెద్ద గొయ్యి రాకపోకలకు ఆటంకంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న మొక్కల వల్ల వాహనాలు తప్పనిసరిగా మ్యాన్ హోల్‌పై నుంచి వెళ్లాల్సి వస్తోంది. మ్యాన్ హోల్‌ను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.