సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

VZM: గంట్యాడ మండలంలోని జగ్గాపురం గ్రామంలో బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.