'ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి'
NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీఎన్టీ హాస్టల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 'ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దాని పర్యవసానాలు' అనే అంశంపై గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.