క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం: ట్రైనింగ్ కలెక్టర్

క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం: ట్రైనింగ్ కలెక్టర్

NRPT: క్షయ వ్యాధిని నిర్మూలించి క్షయరహిత సమాజానికి కృషి చేద్దామని జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ ప్రణయ్ సూచించారు. గురువారం పూసలపాడు గ్రామంలో క్షయ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షయరహిత సమాజానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేందర్ రెడ్డి ఉన్నారు.