VIDEO: కౌంటింగ్ ప్రారంభానికి మున్సిపాలిటీ ఏర్పాట్లు పూర్తి
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేసి, లెక్కింపు మూడు రౌండ్లలో నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్‌కు మూడు వార్డులు కేటాయించబడ్డాయి. ఫలితాలు వార్డుల క్రమంలో కాకుండా, టేబుళ్ల వారీగా వెలువడనుండడంతో ఆసక్తి ఉత్కంఠభరితంగా ఉంది.