ఒంటిమిట్ట రామయ్య సేవలో శ్రీ చరణి
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మహిళ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి శనివారం దర్శించుకున్నారు. తల్లిదండ్రులు రేణుక, చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ఆమె విచ్చేశారు. గర్భాలయంలో సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటేందుకు కృషి చేసిన ఆమెను టీటీడీ అభినందించారు.