VIDEO: కనిగిరిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

VIDEO: కనిగిరిలో  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ప్రకాశం: కనిగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరాగా, దంపతులచే పండితులు స్వామి వారి వ్రతాలను జరిపించారు. వ్రతాల అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.