గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

RR: మొయినాబాద్ నుంచి తోల్కట్ట వెళ్లే మార్గంలో చిన్నషాపూర్ గేట్ సమీపంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తల, శరీర భాగాలపై గాయాలు ఉండడంతో వ్యక్తిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.