వాసవీ మాతకు కరెన్సీ నోట్లతో అలంకరణ

VZM: మండల కేంద్రమైన జామిలో కొలువై ఉన్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళ సభ్యులు కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మావూడూరి రవికుమార్ మహిళలచే లలిత సహస్రనామం పారాయణ చేస్తూ కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.