2 రోజులు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత
SRD: బుస్సారెడ్డిపల్లిలోని 100 ఎంఏల్డీ నీటి శుద్ధి కర్మాగారంలో విద్యుత్ బ్రేక్ కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మునిపల్లి, కోహీర్, జరాసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి, సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, పటాన్చెరు మండలాల్లో సరఫరా జరగదని పేర్కొన్నారు. మరమ్మతు పనుల నిమిత్తం ప్రజలు సహకరించాలని కోరారు.