'ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యం'
KRNL: ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని కోడుమూరు నియోజవర్గం MLA బొగ్గుల దస్తగిరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడూరు మండలంలో ఇవాళ నూతన గృహాలను ఆయన ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన వారికి ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ప్రతీ అధికారి పనిచేయాలని సూచించారు.